రెవిన్యూ సదస్సులు జయప్రదం అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. పర్చూరు మండలంలో నిర్వహించే రెవెన్యూ సదస్సులపై సంబంధిత అధికారులతో సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పర్చూరు మండలం చిననందిపాడు గ్రామంలో సోమవారం జరిగే రెవిన్యూ సదస్సుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్ పి సిసోడియ హాజరవుతారన్నారు. దస్తాలన్నీ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.