గంజాయి అమ్ముతూన్న యువకులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిన చేర్యాల సీఐ శ్రీను.చేర్యాల సర్కిల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ శ్రీను మాట్లాడుతూ చేర్యాల పట్టణ శివారులో గంజాయి తాగుతూ, అమ్ముతున్నారన్న నమ్మదగిన సమాచారంతో చేర్యాల ఎస్ఐ నీరేశ్ సిబ్బందితో వెళ్లి నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారని చేర్యాలకు చెందిన రాసూరి నవీన్,చుంచనకోటకు చెందిన ఏశబోయిన కరుణాకర్, చెట్కూరి శ్రావణ్,పొన్నబోయిన పవన్ లను అదుపులోకి తీసుకొని వారినుండి 50 గ్రాముల గంజాయి,ఒక ట్రాలీ ఆటో, స్కూటర్,నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని రిమండ్ కు తరలిస్తున్నామని అన్నారు.
ఈ సందర్భంగా సీఐ ఎల్.శ్రీను మాట్లాడుతూ గంజాయి తాగుతూ యువత మత్తుకు బానిసవుతున్నారని,చేర్యాల ప్రాంతాన్ని గంజాయి విముక్తిగా చేయడానికి పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.ఎవరైనా గంజాయి తాగుతూ కనిపిస్తే సమాచారం అందించిన ఎడల వారిపై చట్టరిత్య చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ సమావేశంలో చేర్యాల ఎస్ఐ నీరేశ్ ,కానిస్టేబుళ్లు హనుమంతు,గౌతమ్ లు వున్నారు.