సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాలలో బుధవారం ఏసుప్రభు జన్మదినంను పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇండియన్ క్రిస్టియన్ కృసైడ్ చర్చ్ మర్కుక్ లో వేలుగులు విరజిమ్మి, క్రొవ్వొత్తుల కాంతులు, క్రిస్మస్ చెట్లు బాల యేసు జన్మవృత్తాన్ని తెలిపేలా అలంకరించిన పాకలు, సర్వాంగ సుందరంగా ముస్తాబైన చర్చిలు విశ్వాసులతో కిటకిటలాడాయి.
గ్రామాలలో చర్చిలలో క్రైస్తవ సోదర సోదరీమనులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏసుప్రభు నామస్మరణతో కేకులు కట్ చేస్తూ ప్రార్థనలు నిర్వహించారు. శాంతి సందేశాలను అందించారు. దీపాల కాంతుల ఆలయ అలంకరణలో చర్చిలు దగదగా మెరిసి పోయాయి. ఈ కార్యక్రమంలో పాస్టర్ మధు సంఘ పెద్దలు బాబు, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.