ఖమ్మం పర్యటనలో భాగంగా బుధవారం ఖమ్మం పట్టణంలోని దేవాలయాలను మరియు విహే , గురుదక్షిణ క్యాంపస్ ను ఆర్యవైశ్య ప్రముఖులు , అంబికా దర్బార్ బత్తి అధినేత , ప్రముఖ సినీ నిర్మాత , మాజీ ఎమ్మెల్యే , బిజెపి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు అంబికా కృష్ణ తో బిజెపి రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవ రావు కలిసి సందర్శించారు .శ్రీ కన్యకా పరమేశ్వరి మాత ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది . అనంతరం చైర్మన్ మేళ్లచెర్ల వెంకటేశ్వరరావు మరియు కమిటీ సభ్యులు , ఆర్యవైశ్య సోదర సోదరీమణులు వారిని శాలువాతో సత్కరించడం జరిగింది .
శ్రీ శాస్త్రా దేవాలయాన్ని సందర్శించి అయ్యప్ప స్వామివారినీ దర్శించుకోవడం జరిగింది . ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ చిర్లవ్చర్ల రాధ మరియు కమిటీ సభ్యులు అందరూ స్వాగతం పలికి శాలువాతో సన్మానించి , అయ్యప్ప స్వామి మెమొంటో వారికి అందించి ఘనంగా సత్కరించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కన్యకా పరమేశ్వరి మాత మరియు అయ్యప్ప స్వామి అనుగ్రహం సకల జనుల పై ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు .