విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు వైసీపీ సిద్ధమైంది.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు తిరగకుండానే ప్రజలపై 15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోపిందని ఆరోపిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి..దీనికి వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో.. వైసీపీ శ్రేణులు ఆందోళనకు సిద్ధమయ్యారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించటంతో పాటు ర్యాలీలు, వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజలపై వేల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాలను వేయటం దారుణమని వైసీపీ నేతలు భావిస్తున్నారు.ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు పెంచమని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏకంగా 15 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారాలను విధించడాన్ని ఖండిస్తోంది వైసీపీ.. రేపు అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా భాగస్వామ్యంతో విద్యుత్ కార్యాలయాలకు ర్యాలీలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.. పెంచిన విద్యుత్ చార్జీలను కూటమి ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ మెమోరాండంలను సమర్పించనున్నారు. అన్ని జిల్లాల్లోనూ వైఎస్ఆర్ పోరుబాట పేరుతో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలను ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిన నేపథ్యంలో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేశారు. విద్యుత్ చార్జీల పెంపు అన్ని వర్గాలపై ఆర్థికంగా భారాన్ని మోపుతోందంటున్నారు. నిరసన కార్యక్రమాలకు ప్రజాసంఘాలు, సంస్థలను కూడా కలుపుకుని నిరసన ర్యాలీలు పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు.. కరెంట్ చార్జీల విషయంలో బాదుడే బాదుడు అనే విధంగా తయారైందంటున్నారు