ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్మీడియట్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి.. తగలబెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు బైరెడ్డి నగర్ కు చెందిన ఇంటర్ స్టూడెంట్ ని ప్రేమిస్తున్నాని కొలిమిగుండ్ల నివాసి రాఘవేందర్ అనే యువకుడు వెంటపడేవాడు. అయితే, అతని ప్రేమను యువతి లహరి ఒప్పుకోకపోవడంతో.. విద్యార్థిని నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఇక, ఆ తర్వాత తాను నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు యువకుడు రాఘవేందర్. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా మారింది. దీంతో అతడ్ని హస్పటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కాగా యువతి పూర్తిగా కాలిపోవడంతో మరణించినట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన విషయాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.