శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా సోమవారం 6వ రోజు లక్ష బిల్వార్చన, కుంకుమార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి ధూప, దీప నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అభిషేక గురుకుల రాజేష్ గురుకుల్, వేద పండితులు, అర్చకులు మరియు ఆలయ అధికారులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.