ఎమ్మిగనూరు పట్టణంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా సోమవారం 31వ వార్డు ఎల్లమ్మబీడు కాలనీలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పర్యటించారు. వార్డులో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, వీధి లైట్లు తదితర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారి సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దని, అక్కడికక్కడే ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.