గుర్ల పోలీస్ స్టేషన్ ను వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం చీపురుపల్లి డిఎస్పి ఎస్. రాఘవులు సందర్శించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. గ్రామీణ ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. గంజాయి అక్రమ రవాణా, రోడ్డు ప్రమాదాలు తదితర అంశాలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. సైబర్ నేరాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు.