గత ప్రభుత్వ హయాంలో మంజూరైన జగనన్న కాలనీలపై ముసునూరు మండలంలో మంగళవారం విజిలెన్స్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ కే. రాజ్ కుమార్ తెలిపారు. చింతలవల్లి, రమణక్కపేట, తదితర గ్రామాల్లోని జగనన్న లేఔట్ లో పనులను పరిశీలించనున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో జగనన్న కాలనీల లబ్ధిదారులందరూ జగనన్న కాలనీకి పయనం అవుతున్నారు.