అరకులోయ మండలంలోని ఓ వైపు వణికించే చలి మరోవైపు పొగ మంచు దట్టంగా కమ్ముకోవడంతో రెండు రోజులుగా తీవ్రమైన చలి వాతావరణం ఏర్పడింది. మంగళవారం ఉదయం దట్టంగా కమ్ముకున్న పొగమంచు కారణంగా వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు. అయితే చలి పెరగడంతో ఉదయం సాయంత్రం వేళల్లో చిరు వ్యాపారులు పాఠశాలలకు వెళ్లే చిన్నారులు వివిధ విధులకు వెళ్లే ఉద్యోగులు ఉపాధిహామీ కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.