ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధుల తల్లిదండ్రులతో మాట్లాడేందుకు బాపట్లలో ముఖ్యమంత్రి పాల్గొన్న మెగా మీట్ కార్యక్రమం ఒక పొలిటికల్ ఈవెంట్ గా, అదిపెద్ద ఫ్లాప్ షో గా ముగిసిందని మాజీ ఉపసభాపతి, వైయస్ఆర్‌సీపీ నేత కోన రఘుపతి విమర్శించారు. బాపట్లలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి అంశాన్ని రాజకీయంగా ప్రచారం చేసుకోవడం అలావాటైన చంద్రబాబు మరోసారి విద్యార్దుల తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన మెగా మీట్ ను కూడా దానికోసమే వినియోగించుకున్నారని మండిపడ్డారు. ఒక దిశానిర్ధేశం లేకుండా, ఏం ఆశించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారో, విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి ఏ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారో అర్థం కాని పరిస్థితి ఉందని విమర్శించారు.