కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం మెగా పేరెంట్స్ డే పేరుతో డిసెంబర్ 7న కార్యక్రమం నిర్వహించింది, కానీ దాని వల్ల విద్యార్ధులకు ప్రయోజనం శూన్యమన్నారు. ఈ ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏంటి, విద్యావ్యవస్ధకు మీరు ఏం చేశారు, విద్యార్ధులకు ఏ సందేశం ఇచ్చారని ప్రశ్నించారు. మీరు చెప్పుకోవడానికి ఏం లేక, కేవలం ప్రచారానికే ఈ హడావిడి కార్యక్రమం చేపట్టారని ధ్వజమెత్తారు.