మాజీ సీఎం వైఎస్ జగన్ దిశాచట్టం గురించి మాట్లాడుతూ మంత్రి లోకేష్, హోంమంత్రి గురించి మాట్లాడారని.. అసలు దిశాచట్టం అమలులో ఉందా? వైసీపీ హయాంలో ఎన్ని ట్రయిల్స్ జరిపారు? ఎంత మందికి శిక్ష వేశారు? అని కార్మిక శాఖామంత్రి మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రశ్నించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో తీర్మానం చేసి చప్పట్లు కొట్టారు తప్ప గత ప్రభుత్వం దిశాచట్టం కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అసలు దిశకు దిశానిర్ధేశం ఏమైనా ఉందా... ఒక అమ్మాయి బలైనప్పుడు ఏడు రోజుల్లోగా ఎంక్వైరీ అయిపోవాలన్నారు. 14 రోజుల్లో చార్జి షీట్ వేయాలని... ఇలా ఒక్క కేసు అయినా ఇన్వెస్టిగేషన్ చేయగలిగారా అని నిలదీశారు.