శ్రీశైలం మల్లన్న భక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనవేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మామూలుగా శ్రీశైలం వెళ్లే భక్తులకు స్వామివారి స్పర్శ దర్శన భాగ్యం కల్పిస్తుంటారు. అయితే పండుగ వేళల్లో, రద్దీ ఎక్కువగా ఉన్న సమయాల్లో, వారంతరాల్లో మాత్రం స్పర్శ దర్శనానికి అనుమతి నిరాకరిస్తారు ఆలయ అధికారులు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటారు. అయితే స్వామి వారి స్పర్శ దర్శనంపై ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎప్పుడూ కూడా స్వామి వారి స్పర్శ దర్శనం కలిగేలా నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైలంకు వచ్చిన భక్తులు స్వామి వారి స్పర్శ దర్శనం కల్పించే వెసులుబాటును నూతన ఈవో కల్పించారు.