ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిందాల్ పవర్ ప్లాంట్‌లను వైసీపీ గాలికొదిలేసింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 10, 2024, 08:32 PM

వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్‌లను వదిలేసిందని మంత్రి నారాయణ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 మధ్య చాలా స్టడీ చేసిన తర్వాత వేస్ట్‌తో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. ఏడు మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ నుంచి చెత్తను ఈ ప్లాంట్‌కు తరలిస్తున్నారని తెలిపారు. ఇవాళ(మంగళవారం) జీఎంసీ పరిధిలోని జిందాల్ ప్రాజెక్టును మంత్రి నారాయణ పరిశీలించారు. మంత్రి నారాయణతో పాటు ప్రాజెక్టును ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు , స్వచ్చంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాబి పరిశీలించారు.


మంత్రి నారాయణకు జిందాల్ పవర్ ప్లాంట్ పనులను అధికారులు వివరించారు.ప్లాంట్ నిర్వహణ, ఇతర వివరాలు అడిగి మంత్రి నారాయణ తెలుసుకున్నారు. 6890 మెట్రిక్ టన్నుల చెత్తలో 2500 టన్నుల చెత్తను రెండు ప్లాంట్స్ ద్వారా విద్యుత్‌గా మారుస్తున్నారని తెలిపారు. కాకినాడ, నెల్లూరులో త్వరలో ప్లాంట్‌లు ఏర్పాటు చేస్తామని అన్నారు. జగన్ ప్రభుత్వం ఒక్క ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయలేదని చెప్పారు. చెత్త పన్ను వేయడం తప్ప చెత్తను ఎలా ఉపయోగించుకోవాలలో వైసీపీ ప్రభుత్వానికి తెలియదని అన్నారు. చెత్త పన్ను తీసేశాం.. చట్ట సవరణ చేసి మరీ చెత్త పన్ను తొలగించామని చెప్పారు. అమృత్ పథకానికి వైసీపీ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో పథకం కింద ఇచ్చే నిధులు ఉపయోగించలేకపోయామని అన్నారు. టన్ను చెత్తను ట్రీట్ చేయాలంటే రూ.500 నుంచి రూ.750లు ఖర్చవుతుందని.. ఆ ఖర్చు తగ్గించాలంటే చెత్త తరలించడమే మార్గమని మంత్రి నారాయణ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com