రైతుల సమస్యలపై వైయస్ఆర్‌సీపీ ఆందోళన చేపడుతోంది. ఈనెల 13న రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించడంతో పాటు, అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనుంది. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను పార్టీ మంగళవారం రిలీజ్ చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కార్యక్రమ పోస్టర్లు రిలీజ్ చేసిన నాయకులు, సమన్వయ సమావేశాలు నిర్వహించారు. ర్యాలీ నిర్వహణపై చర్చించారు.