గ్రామాలలో నెలకొన్న భూముల సమస్యలను పరిష్కారానికే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తుందని రాజోలు తహశీల్దారు ఎన్ఎస్ఎస్ ప్రసాద్ అన్నారు. రాజోలు మండలం కాట్రేనిపాడులో బుధవారం జరిగిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.
గ్రామంలో రీసర్వేతో భూముల కొలతలు తారుమారు కావడం, ఆన్ లైన్ లో భూములు ఎక్కువ, తక్కువ నమోదు కావడం వంటి సమస్యలు ఉంటే సదస్సులో అర్జీలు ఇవ్వాలని గ్రామస్థులకు సూచించారు.