ఉదయగిరి పట్టణంలో ఈ నెల 3వ తేదీన కట్ట మస్తాన్ అనే వ్యక్తి భార్యను హత్య చేసి పరారయ్యాడు. కావలి డిఎస్పి శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.
మంగళవారం డిఎస్పి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కట్ట ఇందిరా, కట్ట మస్తాన్ కు మూడేళ్ల క్రితం వివాహమైందని వీరికి ఓ బాబు ఉన్నట్లు తెలిపారు. మస్తాన్ మద్యానికి బానిస కావడంతో భార్య విడిగా ఉంటుందని కాపురానికి రాలేదంటూ కత్తితో దాడి చేసి చంపినట్లు తెలిపారు.