కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రజాసమస్యలు తెలుకొని 40 రోజుల్లోనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టిందని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఎమ్మిగనూరు మండలం కడిమెట్లలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో పాల్గొని, రైతుల నుంచి వినతులను స్వీకరించి, మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారం కోసం సీఎం రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేసి, భూ తగాదాలు లేకుండా చేయగలిగారని సూచించారు.