ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2025లో ఏం జరుగుతుంది? 500 ఏళ్ల కిందటి నోస్ట్రాడమస్ జోస్యం ఫలిస్తుందా

international |  Suryaa Desk  | Published : Wed, Dec 11, 2024, 09:24 PM

మరికొన్ని రోజుల్లో కేలండర్‌లో మరో ఏడాది చరిత్రలో కలిసిపోతోంది. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ ఏడాది మిగిల్చిన చేదు జ్ఞాపకాలను, ఇబ్బందులను అధిగమించి.. కోటి ఆశలతో కొత్త ఏడాది కోసం ఎదురుచూస్తుంటారు. వచ్చే సంవత్సరమైన సంతోషంగా ముందుకు వెళ్లాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు ఎలా ఉంటుంది? అని తెలుసుకోవాలని కుతూహలం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే, కొత్త ఏడాదిలో ఏం జరగబోతుంది? ప్రపంచం ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోబోతుంది? అనేది ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు కొన్ని వందల సంవత్సరాల ముందే అంచనా వేశారు. తమ అంచనాలను పుస్తకాలు, ఇతర రూపాల్లో పొందుపర్చారు.


ఈ క్రమంలో 2025లో ఏం జరగుతుందో? ప్రముఖ ఫ్రెంచ్ తత్వవేత్త, జ్యోతిషుడు నోస్ట్రాడమస్ విశ్లేషించిన విషయాలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. నోస్ట్రాడమస్ భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి 945 సంపుటిలతో కూడిన విశ్లేషణలను 1555లో విడుదల చేశారు. ఆయన చెప్పినట్టుగానే ఐరోపాలో అడాల్ఫ్ హిట్లర్ ఆధిపత్యం, ప్రపంచ యుద్ధం, సెప్టెంబరు 11 ఉగ్రదాడులు, కోవిడ్-19 మహమ్మారి వంటి అంచనాలు నిజమయ్యాయి. దీంతో వచ్చే ఏడాదిలో జరగబోయేవాటి గురించి ఆయన అంచనాలపై ఆసక్తి నెలకుంది.


2025లో భూమిని పెద్ద గ్రహశకలం ఢీకొట్టవచ్చని, లేదా అత్యంత ప్రమాదకరంగా సమీపంగా రావచ్చు, ప్రకృతి వైపరీత్యాలు, రాజకీయ హత్యలు ఫ్రెంచ్ జ్యోతిషుడు అంచనా వేశారు. సుదీర్ఘంగా సాగుతోన్న యుద్ధం ముగుస్తుందని నోస్ట్రాడమస్ పేర్కొన్నారు. ‘దీర్ఘకాలిక యుద్ధం ముగుస్తుంది.. బ్రెజిల్‌లో వరదలు, అగ్నిపర్వతం బద్దలవ్వడం వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి.. యూకేలో ప్లేగు వంటి వ్యాధి వ్యాప్తి చెందుతుంది’ అని ఆయన జోస్యం చెప్పారు.


2025 యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే)కు అత్యంత సవాళ్లతో కూడిన ఏడాది అని, క్రూరమైన దాడులు, ప్లేగు వంటి మహమ్మారిని ఎదుర్కోబోతుందని జోస్యం చెప్పారు. ప్రపంచ ఉద్యానగరిగా గుర్తింపు పొందిన బ్రెజిల్‌లో వరదలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించి.. దారుణంగా నష్టపోతుందని అంచనా వేశారు. ఆర్దిక వనరులు, సైనిక శక్తి క్షీణించడంతో దీర్ఘకాలికంగా సాగుతున్న యుద్ధం ముగియనుందని వివరించారు. అంటే దాదాపు గత 33 నెలల నుంచి జరుగుతోన్న ఉక్రెయిన్- రష్యా సంఘర్షణకు తెరపడుతుందని బలంగా నమ్ముతున్నారు.


‘‘సుదీర్ఘ యుద్ధం ద్వారా సైన్యం నష్టపోతుంది... తద్వారా సైనికులకు ఇవ్వడానికి నగదు కొరత ఏర్పడుతుంది.. బంగారు, వెండికి బదులు ఇత్తడి, తోలు నాణేలు చలామణిలోకి వస్తాయి ’’ అని నోస్ట్రాడమస్ విశ్లేషించారు. నోస్ట్రాడమస్ అంచనా వేసినట్టుగా యుద్ధంలో అటు రష్యా, ఉక్రెయిన్ భారీగా సైన్యాలు కోల్పోయి.. ఆర్ధికంగా నష్టపోాయాయి. ఈ నేపథ్యంలో యుద్ధం ముగియాలని వారు కూడా కోరుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com