భార్యభర్తల బంధం ఎంతో ప్రత్యేకమైంది. ఇద్దరు వ్యక్తులు తమ జీవితమంతా కలిసి గడపాలి. ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవాలి. ఈ సంబంధం ప్రేమ, కోపం, బాధ్యతలతో నిండి ఉంటుంది. భార్యభర్తల బంధంలో గొడవలు, అలకలు కూడా ఉంటాయి. ఎన్నో వివాదాలు ఉన్నప్పటికీ.. ప్రేమ మాత్రం అలానే ఉంటుంది. అయితే, ఒక్కోసారి భర్తతో గొడవ పడ్డ భార్య అలక పాన్పు ఎక్కుతుంది. ఎంత బతిమాలినా, ప్రయత్నించినా భార్య అలక మాత్రం వదలదు. దీంతో.. భార్య అలిగితే భర్తకు ఏం చేయాలో తెలియదు. భార్యలకు కష్టం కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత భర్తలపై ఉంది. వారిని హ్యాపీగా ఉంచడం ద్వారా మీ ఇంటితో పాటు మీరు హ్యాపీగా ఉండొచ్చు. భర్తల కోసం కొన్ని చిట్కాలను ముందుకు తీసుకువస్తున్నాం. ఆ చిట్కాలు ఫాలో అయితే భార్యను కూల్ చేయొచ్చు.
స్పర్శ..
ఓ చిన్న స్పర్శ మీ ఇద్దరి ఎడబాటుని దూరం చేస్తుంది. ఒకరినొకరు పరస్పరం తాకుతుంటే ఆ కోపం పోతుందట. మీ భార్య మీ పట్ల కోపంగా ఉంటే.. ఆమెను మాటిమాటికి టచ్ చేస్తుంటే ఐస్‌లా కరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఆమె నుదిటిపై ఓ చిన్న ముద్దు కూడా మీ ఎడబాటుకు చెక్ పెడుతుంది. కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టడం లాంటి పనులతో భార్యను కూల్ చేయవచ్చని నిపుణులు అంటున్నారు.
తగ్గి మాట్లాడండి..
భార్య అలిగినప్పుడు మీరు వెంటనే మీ స్వరాన్ని తగ్గించండి. ఆమెతో ఎంత తగ్గి మాట్లాడితే అంత ప్లస్ పాయింట్ అట. ఆమె చెప్పిన దానికి ఓకే చెబితే చాలట. ఇలా చేసిన మరుక్షణం అప్పటివరకూ చిందులేస్తూ భగభగలాడే భార్య కూల్ అయిపోతుందట. అంతేకానీ.. అలిగిందని ఆమెతో వాదించడం మంచిది కాదు. ఇలా చేయడం వల్ల భార్య కోపం మరింత పెరిగే అవకాశం ఉందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
క్షమాపణలు..
భార్య అలిగినప్పుడు మీ తప్పు ఉన్నా లేకపోయినా సరే ఓ సారీ చెప్పండి. సారీ చెప్పడం వల్ల పోయేదిముంది. మీరు ఆ టైంలో క్షమాపణలు అడిగితే.. భార్య వెంటనే కూల్ అయిపోతుంది. ఎందుకంటే ఆ గొడవలో ఆమె తప్పు లేదని భావిస్తుంది. అందుకే భార్య అలిగినప్పుడు ఓ సారీ చెప్పడం బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు.
వంట చేయండి..
అలిగినప్పుడు భార్యను కూల్ చేయాలంటే మీరు వంటగదిలోకి పోవాల్సిందే. అలక పాన్పు మీద ఉన్నప్పుడు భార్య ఎలాంటి పనులు చేయదు. వంట అస్సలు చేయదు. అందుకే మీరు వంటగదిలోకి వెళ్లి ఆమెకి ఇష్టమైన వంటకాన్ని చేయండి. ఆ తర్వాత వంటకాన్ని మీరే మీ చేత్తో భార్యకి తినిపించండి. ఇలా చేస్తే ఎలాంటి మొండి భార్య అయినా సరే కూల్ అయిపోతుందని నిపుణులు అంటున్నారు.
షాపింగ్..
సాధారణంగా ఆడవారికి షాపింగ్ అంటే చాలా ఇష్టం. భార్య అలిగినప్పుడు భర్త ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తే మంచిది. ఆమెను కూల్ చేయడానికి షాపింగ్‌కి తీసుకువెళ్లండి. భార్యకు ఇష్టమైన చీర లేదా ఏదైనా వస్తువు కొనివ్వండి. దీంతో.. ఆమె కోపం ఒక్కసారి తగ్గిపోతుంది. మీతో సరదాగా గడుపుతుంది.
సర్‌ప్రైజ్ గిఫ్ట్..
భార్య అలిగినప్పుడు ఆమె.. ఎంత బతిమాలినా కోపాన్ని ప్రదర్శించడం ఆపదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెని కూల్ చేయాల్సిన బాధ్యత భర్తకి ఉంది. అందుకే ఆమె అలిగినప్పుడు.. వెంటనే మీరు బయటకు వెళ్లండి. ఆమె కోసం ఏదైనా మంచి గిఫ్ట్ కొనండి. వెంటనే ఇంటికి వచ్చి.. సర్‌ప్రైజ్ చేయండి. ఇంకేముంది భార్య అలక పాన్పు వెంటనే దిగిపోతుంది.
గమనిక..ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల మానసిక ప్రవర్తన, పరిస్థితుల్ని బట్టి ఫలితాలుంటాయి. ఇది ఎవర్ని ఉద్దేశించినది కాదని పాఠకులు గమనించాలి. సమయం తెలుగు ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు.