నెల్లిమర్ల లోని సి కే ఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం భౌతిక శాస్త్రంలో క్లిష్టమైన అంశాలపై విద్యార్థులకు ప్రయోగాత్మక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ మేరకు కళాశాలలో రిసోర్స్ పర్సన్ జోగా చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో ఇన్నోవేటివ్ ఎక్స్పరిమెంట్స్ ఇన్ ఫిజిక్స్ వర్క్ షాప్ నిర్వహించారు. కార్యక్రమంలో రాజాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల భౌతిక శాస్త్ర అధ్యాపకులు విద్యార్థులకు భౌతికశాస్త్రం లో పలు అంశాలపై అవగాహన కలిగించారు.