ఇప్పటికే ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల సర్దుబాటు పేరుతో ప్రజలపై అధిక భారం మోపుతూ ప్రస్తుతం డిజిటల్ మీటర్లను బిగించి ప్రజలను దోచుకునేందుకు కూటమి ప్రభుత్వం పన్నాగం పన్నుతోందని సిపిఎం జిల్లా నాయకులు గాడి అప్పారావు ధ్వజమెత్తారు.
బుధవారం ఆయన కొత్తవలస మండలం ఉత్తరాపల్లిలో విద్యుత్ చార్జీల పెంపునకు నిరసనగా గోడ పత్రికలను ఆవిష్కరించారు. ప్రభుత్వం డిజిటల్ మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.