ఈనెల 14న జరిగే సాగునీటి సంఘాల ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా పనిచేయాలని ఎలమంచిలి నియోజకవర్గం టిడిపి సమన్వయకర్త, రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు సూచించారు.
మునగపాకలో కూటమి శ్రేణులతో సాగునీటి సంఘాల ఎన్నికలపై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సాగునీటి సౌకర్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు.