నిమ్మకాయలు చెట్లు పెద్దగా ఉన్నప్పుడే కాస్తాయనుకుంటే పొరపాటే. చిన్నగా ఉండగా కూడా కాయలు కాస్తాయి. దీనికోసం ముందునుంచీ కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. దీంతో చెట్టుకి ఆకులు ఎన్ని ఉన్నాయో కాయలు కూడా అదే స్థాయిలో కాసే వీలుంటుంది. దీనికి ఎక్కువస్థలం మరీ ఎక్కువ కేర్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఉన్న చిన్నపాటి స్థలంలోనే చిన్న చెట్లకే కాయలు కాసేలా చేయొచ్చు. మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలతోనే ఎక్కువగా కాయలు కాస్తాయి. మరి ఆ టిప్స్ ఏంటో తెలుసుకోండి.
ఎరువులు..
పెరుగుతున్నప్పుడు ముఖ్యంగా వాటి కాలమైన స్ప్రింగ్, వసంత, శరధృతువు కాలంలో మంచి ఎరువులు, ఎక్కువగా ఫాస్పరస్ ఉండే ఎరువుల్ని రెగ్యులర్‌గా వేయండి. అది కూడా ఎంత పరిమాణంలో అంతే వేయాలి. ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తుపెట్టుకోండి.
కత్తిరించడం..
అదే విధంగా, ఎప్పటికప్పుడు కత్తిరిస్తుండాలి. చనిపోయిన, ఏదైనా తెగులు తగిన ఆకుల్ని, కొమ్మల్ని తొలగించండి. దీంతో చెట్టు చూడ్డానికి హెల్దీగా కనిపిస్తుంది, ఉంటుంది. కాబట్టి, మంచిగా కనిపించేవరకూ పాడైపోయిన ఆకుల్ని తీసేయండి. చెట్లని పెంచేటప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
తెగుళ్ళని దూరం చేసేందుకు..
చెట్లకి తెగుళ్ళు, సమస్యలు రావడం కామన్. వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వాటిని తగ్గించేందుకు నియంత్రణ చర్యలు తీసుకోండి. దీతో చెట్లు చక్కగా పెరుగుతాయి. అయితే, కొన్నిసార్లు ఎక్కువగా గాలులు, చలి గాలులు వీస్తుంటాయి. వీటి నుంచి మీ చెట్టుని కాపాడేందుకు టిప్స్ ఫాలో అవ్వండి.
సూర్యకాంతి..
మిగతా చెట్ల సంగతి పక్కనపెడితే నిమ్మ చెట్లకి ఎక్కువగా ఎండ తగలాలి. అప్పుడే అవి చక్కగా పెరుగుతాయి. అనుకున్న విధంగా కాయల్ని పండేలా చేస్తాయి. అందుకోసం ఎండ బాగా తగిలే చోట చెట్లని ఉంచండి.
నీరు..
మనుషులకి ఆహారం ఎలాగో చెట్లకి నీరు కూడా అలానే కాబట్టి, నీరు పోయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా పూత, పండ్లు వచ్చే టైమ్‌లో నీరు పోయండి. అలా అని నీరు ఎక్కువగా పోయకూడదు. అవసరమైనంత వరకూ నీరు పోయండి. చెట్లకి నీరు పోసినప్పుడు కుండిలోని మట్టి తడిచేలా చూసుకోండి. అంతేకానీ, అలానే నీరు నిల్చిపోయేలా చేయొద్దు.