మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తులు, బెయిల్ రద్దుపై సుప్రీం కోర్టులో ఈరోజు (శుక్రవారం) విచారణ జరిగింది.జగన్ కేసుల విచారణలో జాప్యంపై సుప్రీంలో సీబీఐ, ఈడీ నివేదిక దాఖలు చేసింది. కేసుల జాప్యానికి గల కారణాలను అఫిడవిట్‌లో సీబీఐ వివరించింది. సీబీఐ, ఈడీ ఇచ్చిన నివేదికలను పరిశీలించిన తరువాత తీర్పు ఇస్తామని జస్టిస్ అభయ్ ఓకా, పంకజ్ మిట్టల్ ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణ జనవరి 10కి సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది.జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయడంతో పాటు జగన్ బెయిల్ బెయిల్ రద్దు చేయాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పిటీషన్ దాఖలు చేశారు. రఘురామ పిటీషన్‌పై ఈరోజు సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. జగన్ కేసుల విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుందని గతంలో ధర్మాసనం ప్రశ్నించింది. కేసుల స్టేటస్‌ను వివరిస్తూ నివేదిక ఇవ్వాలని గతంలో సీబీఐ, ఈడీలను ధర్మాసన ఆదేశించింది. సుప్రీం ఆదేశాల మేరకు ఈరోజు సీబీఐ నివేదికను దాఖలు చేసింది.