కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు పోరుబాట పేరిట వైయస్ఆర్‌సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమానికి ప్రజలు, రైతుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. రాష్ట్రంలో రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ...కలెక్టర్లకు డిమాండ్ పత్రాలను అందజేశారు.
చంద్రబాబు పోలీసులను ఉపయోగించుకుని వైయస్ఆర్‌సీపీ నాయకులపైన, రైతులపైన హౌస్ అరెస్టులకు, బెదిరింపులకు దిగినా ఎక్కడా వెనకడుగు వేయకుండా, వారు తమ డిమాండ్లు వినిపించడం హర్షణీయం.ఈ క్రమంలో.. ప్రజల తరఫున కూటమి సర్కార్‌పై మరిన్ని పోరాటాలు చేయాలని.. ప్రజా సమస్యల పరిష్కారమే ఈ పోరాటాల ఎజెండాగా ఉండాలని పార్టీ నేతలకు వైయస్ జగన్ సూచించారు. దీంతో.. ఇక నుంచి పోరుబాటలో మరింత దూకుడుగా ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది.పెంచిన కరెంటు ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ఈ నెల 27న కరెంట్ ఛార్జీలు తగ్గించాలంటూ నిరసన కార్యక్రమాలు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదలకు మరో పోరాటం, జనవరి 3న వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ధర్నాలు