చీపురుపల్లి మండలంలో విజిలెన్స్ ఎస్పి ప్రసాద్ రావు ఆధ్వర్యంలో సిబ్బంది శుక్రవారం పలు ఎరువులు దుకాణాల్లో విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా కర్లాం లో గల ఎరువుల దుకాణంలో తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీల్లో కొన్ని ఎరువులు దుకాణాల్లో కాలం చెల్లిన ఎరువులు అమ్మకాలు, బిల్లు, సరుకు మధ్య వ్యత్యాసాలను గుర్తించారు. ఈ మేరకు నిబంధనలు పాటించని ఎరువుల దుకాణాల నిర్వాహకులపై 6ఏ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.