గత వైసిపి ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేసిందని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు అన్నారు. శుక్రవారం గరివిడి మండలం మందిరవలసలో జరిగిన గ్రామ రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొన్నారు.
గత ప్రభుత్వం చేసిన తప్పులను సవరించేందుకే గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూ సమస్యలను రైతులు రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు. కూటమి నాయకులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.