వైఎస్సార్ కడప జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సాక్షి రిపోర్టర్లపై అక్కడి రాజకీయ నాయకులు, అల్లరిమూకలు దాడులు చేయడాన్ని నిరసిస్తూ బొబ్బిలి జర్నలిస్ట్ సంఘ నాయకులు, సభ్యులు బొబ్బిలి తహసిల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులపై దాడులు నశించాలని నినాదాలు చేశారు. కడప జిల్లాలో జర్నలిస్టులపై దాడులు చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.