రెవెన్యూ సదస్సులో రైతులు తమ సమస్యలు తెలియజేస్తే వాటి పరిష్కారానికి చర్యలుచేపడతామని బొబ్బిలి తహసిల్దార్ ఎం. శ్రీను అన్నారు. మండల పరిధిలో మెట్టవలస గ్రామంలో శుక్రవారం రెవిన్యూ సదస్సు నిర్వహించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ సదస్సులకు అనూహ్య స్పందన వస్తుందన్నారు. రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్న వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎక్కువగా అన్నదమ్ముల ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.