అమెరికాలో తెలుగు యువతి మృతి.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన తెనాలి యువతి మృతి. స్థానిక వ్యాపారి గణేష్, రమాదేవి దంపతుల కూతురు పరిమళ(26) MS చేయడానికి 2022లో US వెళ్లి.. అక్కడి టెన్నెసీ రాష్ట్రంలో ఉంటుంది. అయితే ఆమె తన కారులో ప్రయాణిస్తుండగా.. ఒక ట్రక్ ఆ కారును ఢీ కొట్టడంతో మృతి చెందింది.ఈ ప్రమాదంలో నికిత్, పవన్ అనే మరో ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.