మైలవరం నియోజకవర్గంలో ఎన్నికైన సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులకు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాదు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదివారం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో ఎమ్మెల్యేని సాగునీటి సంఘాల ప్రతినిధులు ప్రత్యేకంగా కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.