గంపలగూడెం మండలం పెనుగొలనులో ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పలువురు ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆర్యవైశ్య సంఘం నాయకులు సుగ్గల విష్ణు , దోసపాటి శ్రీనివాసరావు , కోట రాంబాబు జూలూరు ప్రసాద్, నాళ్ళ నాగేశ్వరావు, కొత్తూరు అంజిబాబు శ్రీరాములు ప్రాణ త్యాగం చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారని వివరించారు.