ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహారదీక్ష చేసి ప్రాణాలర్పించిన "అమరజీవి" శ్రీ పొట్టి శ్రీరాములకు వైయస్ఆర్సీపీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మాజీ డిప్యూటీ సీఎం ఎస్. బి అంజాద్ భాష, కడప నగర మేయర్ కే సురేష్ బాబు పాల్గొన్నారు.