కేంద్రం జమిలి దిశగా కసరత్తు చేస్తున్న వేళ అనూహ్య నిర్ణయం తీసుకుంది. జమిలి ఎన్నికల నిర్వహణకు వీలుగా కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే జమిలి బిల్లు ఆమోదించింది.రెండు సభల్లోనూ జమిలికి సంబంధించి రెండు బిల్లుల ఆమోదం పైన ఇప్పటికే కేంద్రం కసరత్తు చేసింది. సభలో పరిస్థితికి అనుగుణంగా అవసరమైతే జేపీసీకి ఇచ్చేందుకు సిద్దమైందని తెలుస్తోంది. చివరి నిమిషం లో కేంద్రం ఆలోచన మారింది. ఇంతకీ ఏం జరుగుతోంది.
కేంద్రం తాజా నిర్ణయంతో
మూడో సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ నాయకత్వం మరో సంచలన నిర్ణయం తమ హాయంలోనే అమలు కావాలని కోరుకుంటోంది. అయోధ్య, ట్రిపుల్ తలాక్, మహిళా రిజర్వేషన్, ఆర్టికల్ 370 రద్దు, నూతన పార్లమెంట్ తరహాలోనే జమిలి ఎన్నికల రికార్డు తమ ఖాతాలోనే జమ కావాలని భావిస్తోంది. ఆ దిశగానే అడుగులు వేస్తోంది. రామనాథ్ గోవింద్ జమిలి ఎన్నికల పైన ఇచ్చిన నివేదిక ఆమోదించిన కేంద్రం.. తాజాగా జమిలి ఎన్నికల బిల్లును ఆమోదించింది. రేపు (సోమవారం) పార్లమెంట్ లో ప్రవేశ పెట్టేందుకు సిద్దమైంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసారు. కానీ, చివరి నిమిషంలో కేంద్రం అనూహ్య నిర్ణయం తీసుకుంది.
మార్పు వెనుక
జమిలి ఎన్నికల బిల్లుపై కేంద్రం చివరి నిమిషంలో వెనక్కి తగ్గిందా.. వ్యూహం మార్చిందా అనే ఆసక్తి కర చర్చకు తాజా నిర్ణయం కారణమవుతోంది. రేపు (సోమవారం) బిల్లు సభలో ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించిన కేంద్రం.. రేపటి లోక్‌సభ బిజినెస్‌లో బిల్లును పొందు పర్చింది. కానీ, ఇప్పుడు ఆకస్మికంగా చివరి నిమిషంలో లోక్‌సభ బిజినెస్‌లో నుంచి ఆ రెండు బిల్లులను తొలగించింది. దీనిపై పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నెల 20వ తేదీతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. దీంతో, ముందుగా చెప్పినట్లుగా రేపు బిల్లును సభలో ప్రవేశ పెట్టకపోతే..ఈ సమావేశాల్లో ఇక బిల్లు పెట్టే అవకాశం లేదనే అంచనాలు వ్యక్తం అవుతు న్నాయి. అయితే, కేంద్రం ఇంతగా కసరత్తు చేసి ఇప్పుడు అజెండా నుంచి బిల్లులను ఎందుకు తప్పించిందనేది అంతు చిక్కని విషయంగా మారుతోంది.
వాట్ నెక్స్ట్రే
పు బిల్లు ప్రతిపాదించే విషయంలో కేంద్రం ఎందుకు సందిగ్ధంలో పడిందనేది ఇతర పార్టీల్లో చర్చ మొదలైంది. కేంద్రం అన్ని లెక్కలు వేసుకొని.. ఆమోదానికి రంగం సిద్దం చేసుకున్న తరువాతనే కేబినెట్ లో బిల్లు ఆమోదించారు. పార్లమెంట్ లో ప్రవేశ పెట్టేందుకు ముహూర్తం ఖరారు చేసారు. కానీ, కేంద్రం రేపటి అజెండా నుంచి బిల్లులను తప్పించటంతో.. చివరి నిమిషం లో ఆర్టికల్ 370 రద్దు సమయంలో చేసిన విధంగా ఏదైనా షాక్ ఇస్తుందా.. లేక, జమిలి అమలు ఆలోచనలో మార్పు వచ్చిందా అనేది స్పష్టత రావాల్సి ఉంది.