చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా సమస్యలొస్తాయి. జీవక్రియ నెమ్మదిస్తుంది. దీంతో బరువు పెరుగుతారు. ఇమ్యూనిటీ తగ్గుతుంది. దీంతో జలుబు, దగ్గు వంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ సమస్యలన్నింటికీ కారణం విటమిన్ డి లెవల్స్ తగ్గడమే. ఎండ తగలకపోవడం వల్లే విటమిన్ డి తగ్గుతుంది. దీనిని పెంచుకోవాలంటే కొన్ని ఫుడ్స్ తీసుకోవాలి.
నువ్వులు..
చలికాలంలో చలి పెరుగుతుంది. కాబట్టి,బాడీలో వేడిని పెంచే నువ్వులని తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు, కీళ్లకి బలం. దీంతో కీళ్ల నొప్పులు, ఎముకల సమస్యలు తగ్గుతాయి. నువ్వులతో మీరు పచ్చళ్లు చేసుకుని తినొచ్చు. నువ్వులని పొడిలా చేసి కూరల్లో వేసుకుని తినొచ్చు. వీటిని తినడం వల్ల రక్తహీనత సమస్య కూడా దూరమవుతుంది. వీటిని పిల్లలకి నువ్వుల ఉండల్లా చేసి ఇవ్వడం వారి ఎముకలకి కూడా బలం.
విటమిన్ డి లోపం ఎందుకొస్తుంది.
మష్రూమ్స్..
మష్రూమ్స్ కూడా విటమిన్ డికి మూలం. వీటిని తినడం వల్ల విటమిన్ డి లెవల్స్ పెరుగుతాయి. వీటిని మీ డైట్‌లో యాడ్ చేయడం వల్ల విటమిన్ డి2, విటమిన్ డి లెవల్స్‌ని పెంచుకున్నవారవుతారు. కాబట్టి, రెగ్యులర్‌గా వీటిని తీసుకోడం అలవాటు చేసుకోండి.
ఉసిరి..
చలికాలంలో దొరికే పండ్లలో ఉసిరి ఒకటి. వీటిని కూడా మీ డైట్‌లో ఏదో ఓ రకంగా తీసుకోండి. దీనిని తీసుకోవడం వల్ల పుష్కలంగా విటమిన్ సి అందుతుంది. దీంతో మలబద్ధకం దగ్గర్నుంచి జీర్ణ సమస్యలు దూరమవుతాయి. ఇమ్యూనిటీని పెంచి జలుబు, జ్వరం, దగ్గు సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఉసిరి పచ్చడి, రసం, ఉసిరి పులిహోర వంటి వంటకాలు చేసి ఆ రుచిని ఆస్వాదించడమే కాకుండా.. ఆరోగ్య ప్రయోజనాలన్నింటినీ పొందొచ్చు.
సెరల్స్..
సెరల్స్, మ్యూసెల్స్ వంటి వాటిలో ఓట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తినడం వల్ల మనకి పోషకాలు అందుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. అయితే, వీటిని తీసుకున్నప్పుడు న్యూట్రిషనల్ లెబుల్స్ తీసుకోవాలి. కారణం, లేబుల్స్ బట్టి విటమిన్ డి లెవల్స్ మారతాయి. కాబట్టి, అందులో ఉన్న పదార్థాలు, వాటిలోని విటమిన్ డి గుణాల కారణంగా వీటిని తీసుకోండి.
రేగిపండ్లు..
చలికాలంలో పిల్లలకి ఎక్కువగా జబ్బు చేస్తుంటుంది. దీనికి కారణం ఇమ్యూనిటీ తగ్గడమే. అందుకోసం పిల్లలకి రేగిపండ్లని తినిపించాలి. కొంతమంది ఈ పండ్లు తింటే జలుబు, దగ్గు వస్తుందనుకుంటారు. కానీ, మోతాదులో తినడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఈ పండ్లలో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. ఈ పండ్లు తినడం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. దీంతో చలికాలంలో కీళ్లు పట్టేయడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ పండ్లలో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎముకల్ని బలంగా చేస్తాయి. ఇందులోని గుణాలు మలబద్ధకం సమస్యని దూరం చేస్తుంది.
చిలగడ దుంప..
ఈ టైమ్‌లో చిలగడ దుంపలు కూడా ఎక్కువగానే దొరుకుతాయి. వీటిని తీసుకుంటే మలబద్ధకానికి చెక్ పెట్టొచ్చు. వీటితో పాటు ఖర్జూరాలు కూడా సమస్యని దూరం చేస్తాయి. కాబట్టి, హ్యాపీగా వీటిని తినడం అలవాటు చేసుకోండి.