గత వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని, ఒక్కొక్కటే సరి చేసుకుంటూ వస్తున్నామని మంత్రి సవిత అన్నారు. ఇప్పటికే ఏ ప్రాంతంలో ఏ పరిశ్రమలు తీసుకురావాలో ఇండస్ర్టీయల్ అధికారులతో సర్వే చేసినట్లు తెలిపారు. త్వరలో నూతన ఇండస్ర్టీ యాజమాన్యానికి పూర్తి సహకారం ఇచ్చి బ్యాంక్ యాజమాన్యంతో రుణాలు అందేలా కృషిచేస్తామన్నారు. ఇందుకుగాను సీఎం చంద్రబాబు సమక్షంలో చర్చలు జరిపి కొత్త పరిశ్రమలు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పల్లె సింధూర, ఎంఎస్ రాజు, మాజీమంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి, ధర్మవరం టీడీపీ ఇనచార్జ్ పరిటాల శ్రీరాములు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొల్లకుంట అంజినప్ప, ఉమ్మడి జిల్లాల బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.