తిరుపతి రూరల్ మండలం గొల్లపల్లి నేషనల్ హైవేపై బుల్డోజర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాదంలో తీవ్ర గాయలు పాలైన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని రుయా ఆస్పత్రి సిబ్బందికి మంత్రి సూచనలు చేశారు. తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు.