ఏపీ రాజధాని అమరావతికి శుభారంభం.. రాజధాని నిర్మాణానికి రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఆమోదముద్ర వేసింది. రూ. 6 వేల 750 కోట్లు రుణం ఇచ్చేందుకు బ్యాంక్ పాలకవర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు రుణం మంజూరు చేసినట్లు ఏపీ ప్రభుత్వానికి గత రాత్రి సమాచారం అందింది. ఇప్పటికే రూ. 6 వేల 850 కోట్లు రుణం ఇచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. విడతలు వారీగా ఈ రెండు బ్యాంకులు కలిపి మొత్తం రూ.15 వేల కోట్లు రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలిపాయి. హడ్కో నుంచి జర్మన్ బ్యాంక్‌తో కలిపి మరో రూ.16 వేల కోట్లు రుణంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హడ్కో పనులకు వెంటనే ప్రభుత్వం టెండర్లుకు పిలవనుంది. సంక్రాంతి తరువాత పనులు ప్రారంభం కానున్నట్లు సమాచారం.