దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త కళంగిరి మదన్ మోహన్ చేస్తున్న ఆరోపణలపై ఎంపీ విజయసాయిరెడ్డి పత్రికా ముఖంగా స్పందించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. శాంతి భర్త మదన్ మోహన్ చేసిన ఆరోపణలు తప్పని తేలే వరకూ పార్లమెంట్ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేయాలని అన్నారు. గిరిజన స్ట్రీని లోబర్చుకుని ఓ కుటుంబాన్ని నాశనం చేశాడని వర్ల మండిపడ్డారు. శాంతి భర్త వారిద్దరిపై చేసిన ఆరోపణల విషయంలో ఎంపీ వెంటనే స్వచ్ఛందంగా విచారణ కోరాలని వర్ల డిమాండ్ చేశారు. తన భార్య శాంతిని తల్లిని చేశాడని, వందల కోట్ల విలువైన భూములను కొట్టేశాడని మదన్ మోహన్.. విజయసాయిరెడ్డిపై చేసిన ఆరోపణలపై ఆయన వెంటనే సమాధానం చెప్పాలని వర్ల డిమాండ్ చేశారు.