నిన్న (శనివారం) ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లోని పలు గ్రామాల్లో స్వల్ప భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఇవాళ (ఆదివారం) కూడా ముండ్లమూరు మండలంలో ఒక సెకను పాటు భూమి కంపించింది. మండల కేంద్రం ముండ్లమూరుతో పాటు సింగన్నపాలెం, మారెళ్ల గ్రామాలలో ప్రకంపనలు నమోదయాయి.వరుసగా రెండవ రోజు కూడా భూప్రకంపనలు నమోదవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో వరుసగా నమోదవుతున్న స్వల్ప భూప్రకంపనలు భయపెడుతున్నాయి.