బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపురం గ్రామ సమీపంలోని చిన్న అమ్మవారు గుడి సమీపంలో సోమవారం రెండు ఆటోలు ఢీకొన్నాయి. బొబ్బిలి నుండి రాంబద్రపురం వెళ్తున్న ఆటోను రామభద్రపురం నుంచి వెళ్తున్న ఆటోని ఢీకొన్నది. ఈ క్రమంలో ఎనిమిది మందికి గాయపడ్డారు. ప్రథమ చికిత్స కొరకు బొబ్బిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానికులు ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా రానున్నాయి.