సోషల్ మీడియా 'ఎక్స్' తన ప్రీమియం ప్లస్ ధరలను భారత్ సహా ఇతర ప్రపంచ మార్కెట్లలో పెంచింది. ఎక్స్ ప్రీమియం ధర ఇప్పటివరకు భారత్‌లో నెలకు రూ.1,300 కాగా.. ఏటా రూ.13,600గా వసూలు చేస్తున్నారు.
దీనిని తాజాగా నెలకు రూ.1,750.. ఏటా రూ.18,300కు పెంచారు. ఎక్స్ అందించే అత్యుత్తమ స్థాయి సేవలను ప్రమీయం ప్లస్‌గా అభివర్ణిస్తారు. వీటిల్లో పూర్తిగా యాడ్‌ఫ్రీ కంటెంట్‌ను చూడొచ్చని వెల్లడించింది.