ఏసు ప్రభువు ఆశీస్సులు రాష్ట్రం, జిల్లా ప్రజలపై ఉండాలని మంత్రి కింజరాపు అచ్చెంన్నాయుడు ఆకాంక్షించారు. శ్రీకాకుళం బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో ఏర్పాటు చేసిన హైటీ క్రిస్మస్-2024 కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
పాస్టర్లకు గౌరవ వేతనం కింద ప్రభుత్వం నెలకు రూ.5వేలు ఇస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రేమతో మెలగాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ పుండ్కర్ మాట్లాడుతూ.. చర్చిల వద్ద భద్రత, పారిశుధ్యం, తాగునీరు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యేలు బగ్గు రమణమూర్తి, గొండు శంకర్, ఆర్డీవో కె.సాయి ప్రత్యూష, పాస్టర్ కృపానందం, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జాన్ తదితరులు పాల్గొన్నారు.