నాగలాపురం మండలం రెప్పల తిప్ప సమీపంలోని అటవీ ప్రాంతంలో ఎర్రచందనం తరలించే వారిపై మంగళవారం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే పాత నేరస్తులతో పాటు ఐదుగురు కూలీలను అరెస్ట్ చేసినట్లు తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. సుమారు రూ. 20 లక్షలు విలువ గల 69 ఎర్రచందనం దుంగలు, బరువు 479 కిలోలు, ఒక మోటర్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతిలో తెలిపారు.