తాటి బెల్లం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దీని గురించి తెలిసే ఉంటుంది. సాధారణ బెల్లం కంటే ఇది కాస్త నలుపు రంగులో ఉంటుంది. రుచి కూడా వేరుగా ఉంటుంది.బెల్లం కంటే ఈ తాళి బెల్లంలోనే ఎక్కువగా పోషకాలు లభిస్తాయి. ఈ చలి కాలంలో తింటే ఆరోగ్యానికి మరింత మంచిది.తాటి బెల్లాన్ని.. తాటి చెట్ల నుంచి వచ్చే రసంతో దీన్ని తయారు చేస్తారు. శీతా కాలంలో ఎక్కువగా రోగాల బారిన పడుతూ ఉంటారు. జలుబు, దగ్గు, జ్వరం వంటివి ఎటాక్ చేస్తూ ఉంటాయి. తాళి బెల్లం తింటే శరీరంలో ఇమ్యూనిటీ స్థాయిలు పెరిగి.. రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది.శరీరానికి తగిన శక్తిని ఇస్తుంది. డయాబెటీస్ ఉన్నవారు కూడా మితంగా ఈ తాటి బెల్లాన్ని తినవచ్చు. ఈ బెల్లం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది. వెయిట్ లాస్ ఉన్నవారు తిన్నా.. బరువు అదుపులో ఉంటుంది.తాటి బెల్లం తినడం వల్ల కాలేయం కూడా శుభ్ర పడుతుంది. శరీరంలోని వ్యర్థాలు, మలినాలను బయటకు పంపుతుంది. మీరు తినే ఆహారం రుచిని కూడా పెంచుతుంది. జీర్ణ ఆరోగ్యాన్ని పెంచుతుంది.తరచూ తింటే తలనొప్పి, మైగ్రైన్ కూడా అదుపులోకి వస్తుంది. చలి కాలంలో వచ్చే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. పీరియడ్స్‌లో వచ్చే నొప్పులు సైతం కంట్రోల్ అవుతాయి. ప్రెగ్నెంట్ లేడీస్ తింటే మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు.