రాజంపేట బస్టాండులో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతిని పురస్కరించుకొని రాజంపేట ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తల ఆద్వర్యంలో ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుభాషా కోవిదుడు వాజ్‌పేయ్ మహిళా సాధికారత, సామాజిక సమానత్వం కోసం పాటు పడ్డారన్నారు