ఈనెల 27న కరెంటు చార్జీల బాదుడుపై వైఎస్సార్సీపీ పోరు బాటను జయప్రదం చేయాలని మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్ పేర్కొన్నారు. బుధవారం పరిగిలో పోరుబాట పోస్టరును ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరెంటు చార్జీల బాదుడుపై మాజీ సీఎం, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.